: ‘సంస్కృతి తీవ్రవాదుల’ నుంచి తమిళ సంస్కృతిని కాపాడాల్సిన అవసరం ఉంది: సినీ నటి కస్తూరి
తమిళంలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షోను నిలిపేయాలని ఇది తమిళ సంస్కృతిని నాశనం చేస్తోందని, షోలో పాల్గొనే వారి భాష అభ్యంతరకరంగా ఉందని చెబుతూ తమిళ సంఘాలు ఆందోళనలు చేసి, కమలహాసన్ పై చెన్నైలో పోలీస్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కమలహాసన్ మీడియా ముందుకు వచ్చి బిగ్ బాస్ రియాలిటీ షో గురించి వివరణ ఇచ్చారు.
ఈ క్రమంలో కమలహాసన్ కు ప్రముఖ సినీ నటి కస్తూరి మద్దతుగా నిలిచింది. కొన్ని సంఘాలు డిమాండ్ చేస్తున్నట్టు బిగ్ బాస్ పోటీదారులను అరెస్టు చేయాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. ‘సంస్కృతి తీవ్రవాదుల’ నుంచి తమిళ సంస్కృతిని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. హిందూ మతం ఏ ఒక్కరి ఆస్తి కాదని, కంచె వేసి దానిని కాపాడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని ఆమె స్పష్టం చేసింది.