: పోరాడి నెగ్గడంలో ఉండే అనుభూతే వేరు: రవీంద్ర జడేజా


శ్రీలంక టూర్ నిమిత్తం టీమిండియా వచ్చే వారం బయలుదేరి అక్కడికి వెళ్లనుంది. జులై 21న జరిగే వార్మప్ మ్యాచ్ తో కోహ్లీ సేన బరిలోకి దిగుతుంది. సుమారు నెలకు పైబడి సాగే ఈ టూర్ లో శ్రీలంకతో మూడు టెస్ట్ మ్యాచ్ లు, 5 వన్డే మ్యాచ్ లు, ఒక 20 ట్వంటీ మ్యాచ్ ను టీమిండియా ఆడనుంది. త్వరలో శ్రీలంక టూర్ కు వెళ్లనున్న స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ను మీడియా పలకరించగా..‘సవాళ్లను ఎదుర్కొని రాణించడమంటే నాకు ఇష్టం. క్రికెట్ లో అలవోకగా విజయం సాధించడం లేదా వికెట్లు తీయడంలో మజా ఉండదు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే, పోరాడి నెగ్గడంతో ఉండే అనుభూతే వేరు’ అని అన్నాడు.

‘జామ్ నగర్ లో నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన రోజుల్లో, సరైన సదుపాయాలు ఉండేవి కావు. శని లేదా ఆదివారాల్లో ఏదైనా మ్యాచ్ ఆడాలని అనుకున్నప్పుడు.. అన్ని ఏర్పాట్లు నేనే చూసుకునేవాడిని. నా అంతట నేనే వికెట్లు తయారు చేయడంతో పాటు, బాల్స్ కొనేందుకు డబ్బుల ఏర్పాటు చేసేవాడిని. అప్పటి నుంచి నా లక్ష్యం ఒకటే ... భారత్ తరపున బ్లూజెర్సీ ధరించి ఆడాలని. భారతజట్టు సభ్యులు బ్లూ జెర్సీలు ధరించి ఆడుతున్న సందర్భాల్లో..నేనూ ఆ జట్టులో సభ్యుడిని కావాలని భావించే వాడిని. ఇండియా తరపున ఆడాలని అనుకునేవాడిని’ అని రవీంద్రజడేజా తన చిన్ననాటి విషయాలను గుర్తుచేసుకున్నాడు.

  • Loading...

More Telugu News