: జగన్కు డబ్బు మీద మాత్రమే ప్రేమ ఉంది: మంత్రి ప్రత్తిపాటి విమర్శలు
వచ్చే ఎన్నికల తర్వాత తాను సీఎం అవుతానని చెప్పుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నిప్పులు చెరిగారు. జగన్ కోరిక ఓ పగటి కలగానే మిగిలిపోతుందని విమర్శించారు. ఈ రోజు ఆయన తిరుపతి రూరల్ మండలంలో మాట్లాడుతూ.. జగన్కు డబ్బు మీద మాత్రమే ప్రేమ ఉందని అన్నారు. రాష్ట్రంలోని ప్రజలు, అమరావతి నిర్మాణంపై జగన్కు ఆలోచన లేదని అన్నారు. ప్రజల మెప్పు పొందుతూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్న చంద్రబాబుకు, అవినీతిలో కూరుకుపోయిన జగన్కు ఎంతో తేడా ఉందని అన్నారు. ఏపీలో తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలుచేస్తుందని ఆయన అన్నారు.