: దలాల్ స్ట్రీట్ లో బుల్ రంకెలు.. రికార్డు స్థాయిలో ముగిసిన సెన్సెక్స్!
దలాల్ స్ట్రీట్ లో బుల్ జోరు కొనసాగుతోంది. చరిత్రలో తొలిసారి సెన్సెక్స్ 32వేల మార్కును దాటింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 232 పాయింట్ల లాభంతో 32,037కు ఎగబాకింది. నిఫ్టీ 75 పాయింట్లు లాభపడి 9,891 దగ్గర క్లోజ్ అయింది.
బీఎస్ఈ టాప్ గెయినర్స్...
సింటెక్స్ ఇండస్ట్రీస్ (15.76%), నెట్ వర్క్ 18 మీడియా (11.84%), టీవీ 18 బ్రాడ్ కాస్ట్ (7.92%), నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (7.23%), కేఈసీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (6.26%).
టాప్ లూజర్స్...
జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రా (-4.33%), ప్రిస్టేజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (-3.21%), శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్ (-3.18%), ఇండియన్ ఆయిల్ (-3.04%), హెక్సావేర్ టెక్నాలజీస్ (-2.77%).