: బాలీవుడ్ అక్కడికి వెళ్తుంటే... ప్రియాంక ఇక్కడికొస్తోంది!
న్యూయార్క్‌లో జరగనున్న ఐఫా 2017 అవార్డుల వేడుకకు బాలీవుడ్ సెలబ్రిటీలంతా అక్కడికి వెళ్తుంటే, అక్కడే నివాసముంటున్న ప్రియాంక చోప్రా మాత్రం ముంబైకి వస్తోంది. అవార్డుల వేడుకకు హాజరవడం ఇష్టం లేక మాత్రం కాదండోయ్! జూలై 18న తన 35వ పుట్టినరోజును కుటుంబం, స్నేహితులతో జరుపుకోవడానికి ఆమె ముంబై వస్తోంది. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రాం ద్వారా పంచుకుంది. క్వాంటికో టీవీ సిరీస్, హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ఆమెకు చాలా కాలం తర్వాత ఖాళీ సమయం దొరికిందట. దీంతో ఏ మాత్రం సమయం దొరికినా కుటుంబంతో గడపడానికి ఇష్టపడే ప్రియాంక ముంబై పయనమైంది. ఏ దేశంలో ఉన్నప్పటికీ మాతృదేశంపై ఎప్పుడూ తనకు ప్రేమే అని ప్రియాంక మరోసారి నిరూపించింది.