: ఇప్పటికి పలు కేసుల్లో ఇరుక్కున్న బాలీవుడ్ సెలబ్రిటీలు వీరే!


మాలీవుడ్ లో నటి భావన లైంగిక వేధింపుల కేసులో నటుడు దిలీప్ ను పోలీసులు అరెస్టు చేసి, జైలుకు పంపడం...టాలీవుడ్ లో డ్రగ్ మాఫియా జూలు విదిల్చిన నేపథ్యంలో సినీ పరిశ్రమలో వివిధ కారణాలతో జైలు శిక్ష అనుభవించిన సెలబ్రిటీలపై పెద్ద చర్చ నడుస్తోంది. అలా జైలు శిక్ష అనుభవించిన సినీ సెలబ్రిటీల్లో అగ్రస్థానంలో సంజయ్ దత్ ఉన్నాడు.

సంజయ్ దత్ 1993 ముంబై పేలుళ్ల కేసులో అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడన్న నేరంపై అరెస్టయ్యాడు. అతని వద్ద ఏకే 47 ఉందని పోలీసులు అతనిని అరెస్టు చేశారు. ఈ కేసులో సుమారు ఐదేళ్ల జైలు జీవితం అనుభవించిన సంజయ్ దత్ గత ఏడాది ఫిబ్రవరిలో శిక్షాకాలం పూర్తి కాకుండానే సత్ప్రవర్తన కారణంగా విడుదలయ్యాడు. అతని తరువాత వివాదాస్పద ప్రవర్తనతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా జైలు జీవితం అనుభవించాడు.

1998లో రాజస్థాన్ లో కృష్ణ జింకలను వేటాడారంటూ సల్మాన్ ఖాన్ తో పాటు సైఫ్ అలీ ఖాన్, సోనాలీ బెంద్రే, శిల్పా శెట్టి, టబు, నీలంలపై స్థానికులు కేసులు పెట్టారు. ఈ కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసు కొట్టేశారు. ఇంతలో 2002లో హిట్‌ అండ్‌ రన్‌ కేసులో సల్మాన్ అరెస్టయ్యాడు. జైలు జీవితం అనుభవించాడు. బెయిల్ పై విడుదలయ్యాడు. సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసును కూడా సరైన ఆధారాల్లేవంటూ న్యాయస్థానం కొట్టేసింది.

తరువాత బాలీవుడ్ నటి మోనికా బేడీ అరెస్టు బాలీవుడ్ తో అండర్ వరల్డ్ కనెక్షన్ ను ప్రపంచానికి చాటింది. 2002 సెప్టెంబర్ లో మోనికా బేడీ అండర్ వరల్డ్ డాన్ అబూ సలేంతో పాటు పోర్చుగల్ లో అరెస్టైంది. పాస్ పోర్టు ఫోర్జరీ కేసులో స్వదేశానికి వచ్చి జైలు జీవితం అనుభవించింది. ఆ తరువాత బాలీవుడ్ కామెడీ హీరో గోవిందా 2008లో అరెస్టయ్యాడు. 1990ల్లో తన డ్యాన్స్‌ తో బాలీవుడ్‌ ను ఓ ఊపు ఊపిన గోవింద... 20008లో 'మనీ హై తో హనీ హై' సినిమా షూటింగ్‌ సమయంలో తనను చూసేందుకు వచ్చిన అభిమానిపై చేయిచేసుకోగా అతను కేసు పెట్టాడు. దీంతో అతనిని అరెస్టు చేయగా, అతనికి క్షమాపణలు చెప్పి జైలు శిక్ష తప్పించుకున్నాడు.

అనంతరం మమతా కులకర్ణిపై కేసు నమోదైంది. మాఫియా డాన్, డ్రగ్ డీలర్ విక్కీ గోస్వామితో మమతా కులకర్ణికి సంబంధాలు ఉన్నాయి. విక్కీ గోస్వామి నైజీరియన్లతో కలిసి డ్రగ్ దందా నడిపిస్తున్నాడు. అతనితో మమతా కులకర్ణికి డ్రగ్స్ సరఫరాలో భాగస్వామ్యం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా దిలీప్ సహనటిపై లైంగిక వేధింపుల కేసులో జైలు కెళ్లాడు. టాలీవుడ్ లో చిన్న ఆర్టిస్టులు డ్రగ్స్ ఆరోపణల్లో అరెస్టైనా జైలుకు వెళ్లలేదు.

  • Loading...

More Telugu News