: ఆధార్ అవసరమా? కాదా?.. తేల్చేయనున్న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం!


సంక్షేమ పథకాలు సహా దాదాపు అన్నింటికీ కేంద్రం ఆధార్‌ను తప్పనిసరి చేసింది. జూన్ 30 నుంచి సెప్టెంబరు 30లోపు ఆధార్‌ను రిజిస్టర్ చేసుకోవాలని గడువు విధించింది. దీనిపై ఒకరు సుప్రీంను ఆశ్రయించారు. ప్రభుత్వ నిర్ణయంపై తక్షణం స్టే ఇవ్వాలని కోరారు. పిటిషన్‌ను విచారించిన ద్విసభ్య ధర్మాసనం విచారణను ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. ఆధార్ తప్పనిసరా? కాదా? అన్న విషయం తేల్చేందుకు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖెహర్ అంగీకరించారు.

ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యానగా ధర్మాసనం రెండు రోజులపాటు ఈ పిటిషన్‌పై వాదనలు వింటుందని, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటుందని ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. సెప్టెంబరు 30 గడువుపై స్టే ఇవ్వాలా? లేదంటే పిటిషన్ల విచారణకు తొమ్మిది మంది జడ్జిల రాజ్యాంగ ధర్మాసనానికి రెఫెర్ చేయాలా? అనే విషయాన్ని నిర్ణయిస్తుందని కోర్టు తెలిపింది.

  • Loading...

More Telugu News