: నన్ను అరెస్టు చేసినా ఫర్వాలేదు!: కమలహాసన్
సెలబ్రిటీ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ పేరిట తమిళ సంస్కృతిని దెబ్బతీస్తున్నారంటూ ఆ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ప్రముఖ నటుడు కమలహాసన్ ని, షో నిర్వాహకులను అరెస్టు చేయాలని హెచ్‌ఎంకే (హిందు మక్కల్ కట్చి) సంఘం సెక్రటరీ శివ డిమాండ్ చేయడం.. చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఈ విషయంలో ఆయన ఫిర్యాదు చేయడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కమల్ స్పందిస్తూ.. ‘నన్ను అరెస్ట్ చేసినా ఫర్వాలేదు. ‘బిగ్‌బాస్’ ఓ సామాజిక కార్యక్రమం. అందుకే, దీనికి వ్యాఖ్యాతగా ఉండేందుకు అంగీకరించాను. క్రికెట్ మ్యాచ్ నిర్వహించే సమయంలో ఉండే చీర్ లీడర్స్ పై ఎందుకు నిషేధం విధించరు? హిందూత్వ గ్రూపులు నన్ను కమ్యూనిస్టుగా పేర్కొనడం తప్పు. వాస్తవానికి, నేను రేషనలిస్ట్‌ని. కొత్త ఆలోచనలను, ఆవిష్కరణలను నేనెప్పుడూ స్వాగతిస్తాను’ అని అన్నారు.