: ‘భారత్ మాతాకీ జై’ అనలేదని ఓ మతపెద్దను కొట్టారు!


‘భారత్ మాతాకీ జై’ అనే నినాదం చేయని ఓ ముస్లిం మత పెద్దపై అవమానకర రీతిలో ప్రవర్తించిన సంఘటన హర్యానాలోని హిస్సార్ ప్రాంతంలో జరిగింది. జమ్మూకాశ్మీర్ లోని అనంత్ నాగ్ లో అమర్ నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ హిస్సార్ లో నిన్న ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో ఓ మసీదు వద్దకు ఆందోళనకారులు చేరుకున్న సందర్భంలో ఈ సంఘటన జరగింది. అప్పుడే మసీదు నుంచి బయటకు వచ్చిన ఓ మతపెద్దను ‘భారత్ మాతాకీ జై’ అనాలంటూ ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అందుకు నిరాకరించిన ఆయనపై ఆందోళనకారుల్లో ఒకరు చేయి చేసుకున్నారు. అయితే, సదరు ఆందోళనకారుడిని వెంటనే, అక్కడి నుంచి పంపించి వేయడంతో గొడవ సద్దుమణిగింది.  

  • Loading...

More Telugu News