: డ్రగ్స్ కేసులో.. హీరోలు, దర్శకులు, నిర్మాతలకు నోటీసులు.. ఉలిక్కిపడ్డ టాలీవుడ్!
డ్రగ్స్ వ్యవహారంతో తెలుగు సినీ రంగం పరువు మొత్తం గంగలో కలిసింది. ఇండస్ట్రీలోని పలువురు నిర్మాతలు, దర్శకులు, నటీనటులు డ్రగ్స్ తీసుకుంటున్నారన్న వార్తలతో టాలీవుడ్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ ఉదయం ఇండస్ట్రీ పెద్దలు ప్రెస్ మీట్ పెట్టి మరీ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. కొందరి వల్ల పరిశ్రమ పరువు పోతోందని వాపోయారు. సరైన మార్గంలో నడవాలని సూచించారు.
మరోవైపు, డ్రగ్స్ వ్యవహారంలో సినీ పరిశ్రమకు చెందిన 10 మందికి ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయిన వారిలో ముగ్గురు యువ హీరోలు, నలుగురు దర్శకులు, ఇద్దరు నిర్మాతలు, ఒక స్టంట్ మాస్టర్ ఉన్నారు. వీరంతా ఆరు రోజుల్లోగా విచారణకు హాజరుకావాలని అధికారులు ఆదేశించారు. పరిశ్రమకు చెందిన పలువురికి నోటీసులు జారీ అయ్యాయనే వార్తలతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది.