: భావన లైంగిక వేధింపుల కేసులో మరో మలయాళ నటుడుని ప్రశ్నించనున్న పోలీసులు


ప్రముఖ నటి భావనపై లైంగిక వేధింపుల కేసులో మలయాళ ప్రముఖ నటుడు దిలీప్ అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసులో మరో సినీ నటుడు, ఎమ్మెల్యే పేరు బయటకు వచ్చింది. నటుడు ముకేష్ ను విచారించాలని కేరళ పోలీసులు నిర్ణయించారు. ముకేష్ కు డ్రైవర్ గా ఉంటూనే పల్సర్ సునీ భావనను కిడ్నాప్ చేసి, లైంగిక వేధింపులకు పాల్పడి వీడియో చిత్రీకరించాడు. దిలీప్‌ సినిమా 'సౌండ్‌ థోమా' షూటింగ్‌ కొనసాగుతున్న సమయంలో ముకేష్ కు పల్సర్ సుని డ్రైవర్‌ గా పని చేశాడు.

అంతే కాకుండా, 2013లో ఎర్నాకుళంలో జరిగిన మలయాళ మూవీ ఆర్టిస్ట్స్‌ సంఘం (అమ్మ) షోకు కూడా ముకేష్ డ్రైవర్‌ గా పల్సర్ సుని ఆ వేడుకలకు హాజరయ్యాడు. పల్సర్ సునితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న ముకేష్ ను విచారిస్తే ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. అంతే కాకుండా దిలీప్ సోదరుడు అనూప్ ని కూడా రెండో సారి విచారించనున్నారు. మరోపక్క, రిమాండ్ లో ఉన్న దిలీప్ కు బెయిల్ నిరాకరించిన న్యాయస్థానం, రెండు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. దీంతో పోలీసు విచారణలో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News