: మా అమ్మతోనైనా గొడవ పడతాను...మా అత్తయ్యతో మాత్రం పడను!: వితికా శేరు
నిద్రమాత్రల డోస్ ఎక్కువై నిద్రపోతే...తానేదో ఆత్మహత్యకు పాల్పడ్డానంటూ సోషల్ మీడియాలో దుమారం రేగడంపై యువనటుడు వరుణ్ సందేశ్ భార్య వితికా శేరు మండిపడింది. తామిద్దరం ప్రేమ వివాహం చేసుకున్నామని, తమ అత్త కుటుంబం తనను ఎంతో ఆదరంగా చూస్తారని తెలిపింది. వరుణ్ సందేశ్ తో ఎలాంటి మనస్పర్థలు లేవని చెప్పింది. తన తల్లితో అయినా గొడవపడతానేమో కానీ.... తన అత్తతో మాత్రం గొడవ పడనని తెలిపింది. తాను హైపర్ యాక్టివ్ గా ఉంటానని, అలాంటిది ఎక్కువ సేపు నిద్రపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారని, అంతకు మించి ఏమీ లేదని... దీనికి ఇప్పటితో ముగింపు పలకాలని వితికా శేరు స్పష్టం చేసింది. తన అత్తమామల సూచనతోనే మీడియా ముందుకు వచ్చానని వితికా శేరు తెలిపింది.