: జీఎస్టీ దెబ్బకు ఎగరలేని ఇండిగో విమానాలు!
జీఎస్టీ వల్ల విమానాలు ఎరగలేకపోవడమేంటీ, అంటూ ఆశ్చర్యపోతున్నారా...? అసలు విషయం తెలుసుకోవాల్సిందే. చౌక ధరల విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన ఎయిర్ బస్ ఏ320 నియో మోడల్ విమానాలు ఇంజన్ సమస్యల వల్ల నేలపైనే నిలిచిపోయాయి. ప్రస్తుతం ఈ సంస్థ వద్ద ఏ320 నియో విమానాలు 22 ఉన్నాయి. వీటిలో తొమ్మిది ఎగరలేకపోతున్నాయి. కారణం వీటిలో ప్రాట్ అండ్ విట్నే ఇంజన్లు వాడడమే. ఈ ఇంజన్లను తిరిగి మార్చేందుకు ఎయిర్ బస్ అంగీకరించింది. అయితే ఇంజన్ల దిగుమతులపై ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ కింద పన్ను పడుతుందా? లేదా? అన్న అంశంలో స్పష్టత లేదు. దీనికితోడు ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ బస్ కు సంబంధించిన నియో మోడల్ ఇంజన్లలో సమస్య వల్ల వాటిని మార్చాల్సిన అవసరం ఏర్పడడంతో ఆ డిమాండ్ ను కంపెనీ చేరుకోలేకపోవడమూ కారణమేనని తెలుస్తోంది.