: 'టాలీవుడ్ లో డ్రగ్స్ వాడకం' వార్తలపై స్పందించిన సినీ ప్రముఖులు!


సినీ పరిశ్రమలో డ్రగ్స్ వినియోగంపై సీని ప్రముఖులు స్పందించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నిర్వహించిన సమావేశంలో నిర్మాతలు దగ్గుబాటి సురేష్ బాబు, అల్లు అరవింద్, నటులు శ్రీకాంత్, నరేష్, శివాజీ రాజా, మాటల రచయిత, నటుడు పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజంలో రేవ్ పార్టీల సంస్కృతి పెరిగిపోతోందని అన్నారు. డ్రగ్స్ వినియోగం ప్రమాదకరంగా మారిందని తెలిపారు. ప్రతివారు సొంతగా తమను తాము నియంత్రించుకోవాలని సూచించారు.  

 సినీ పరిశ్రమలో కొందరు డ్రగ్స్ వినియోగిస్తున్నారంటూ వార్తలు రావడం పరిశ్రమకు మంచిది కాదని వారు హెచ్చరించారు. అలాంటి వారు వ్యవసనాన్ని అదుపులో పెట్టుకోవాలని సూచించారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, డ్రగ్స్ అరికట్టేందుకు సహకరించాలని వారు పిలుపునిచ్చారు. ఇందుకు సినీ పరిశ్రమ ఆదర్శంగా నిలబడాలని అన్నారు. సినిమాలలో కూడా డ్రగ్ సన్నివేశాలు పెట్టాల్సి వచ్చినప్పుడు వాటిని ఎలా రూపుమాపవచ్చో కూడా చూపించాలని వారు అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News