: కర్ణాటకలోని ప్రధాన కార్యాలయాన్ని మూసేసిన ఐటీ దిగ్గజం విప్రో
దేశీయ ఐటీ దిగ్గజం, కన్జ్యూమర్ ఉత్పత్తుల సంస్థ విప్రో కర్ణాటకలో ఉన్న ఓ ప్రధాన కార్యాలయాన్ని మూసివేసింది. మైసూరులో ఉన్న లైట్నింగ్ ఉత్పత్తుల కేంద్రాన్ని షట్ డౌన్ చేసింది. డిమాండ్ భారీగా పడిపోవడంతో మైసూరులో ఉన్న కేంద్రాన్ని మూసివేస్తున్నట్టు విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైటింగ్ తెలిపింది. ఎల్ఈడీ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుండటంతో... తమ సీఎఫ్ఎల్ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిపోయిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. పరిస్థితిని మెరుగు పరిచేందుకు అన్ని రకాలుగా యత్నించామని... అయినప్పటికీ ఏడాదికి పైగా ఆర్థిక భారం భరించలేని స్థాయికి వచ్చిందని చెప్పింది.