: నడుముకున్న తుపాకీ పేలి కాలిలో దిగబడ్డ తూటా!


నడుముకి ఉన్న తుపాకీ ప్రమాదవశాత్తు పేలి కాలిలోకి తూటా దిగబడిన ఘటన మహబూబ్‌ నగర్ జిల్లా అడ్డాకుల హైవేపై గల ఒక హోటల్‌ లో చోటుచేసుకుని కలకలం రేపింది. ఘటన వివరాల్లోకి వెళ్తే... జాతీయ రహదారిపై ఉన్న హోటల్ కు పిస్తోలు నడుముకు ధరించిన ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన భోజనానికి సమాయత్తమవుతుండగా, ప్రమాదవశాత్తు తుపాకీ పేలి, ఆయన కాలిలో తూటా దిగింది. దీంతో పోలీసులకు సమాచారమిచ్చిన హోటల్ సిబ్బంది అతనిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అక్కడి నుంచి బాధితుడ్ని హైదరాబాద్ మలక్‌ పేట యశోద ఆసుపత్రికి తరలించారు. దీంతో అక్కడి వైద్యులు అతని కుడి కాలులో బుల్లెట్ ఉన్నట్లు గుర్తించి, చికిత్స ప్రారంభించారు. దీంతో అతను పిస్తోలుతో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? దానికి లైసెన్స్ ఉందా? లేదా? అన్న వివరాలపై దర్యాప్తు ప్రారంభించారు. 

  • Loading...

More Telugu News