: మూడో విడత హరితహారం షురూ... కరీంనగర్ లో ప్రారంభించనున్న కేసీఆర్
తెలంగాణలో మూడో విడత హరిత హారం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సారి భారీ ఎత్తున మొక్కలు నాటాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారు 40 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు, ఉద్యోగుల సహకారంతో భారీ ఎత్తున మొక్కలు నాటనున్నారు. నేటి ఉదయం కరీంనగర్ పట్టణంలో సీఎం కేసీఆర్ మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.