: ‘విశాఖ’లో దోపిడీ దొంగల బీభత్సం!


విశాఖపట్టణంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానిక పైనాపిల్ కాలనీలోని దారపాలెంలో ఓ ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడ్డారు. మహిళలను కత్తులు, తుపాకులతో బెదిరించడమే కాకుండా, పసిపాపపై కత్తిపెట్టి బెదిరిస్తూ, 8 తులాల బంగారు ఆభరణాలు అపహరించుకుపోయారు. ఆరు లేదా ఎనిమిది మంది దొంగలు వచ్చారని బాధితులు చెబుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ దొంగతనానికి పాల్పడింది అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనేనని అనుమానం వ్యక్తం చేశారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News