: ఎరుపు రంగు లంగా ఓణీలో సమంత.. ఎలా ఉందో చూడండి!


చెన్నై బ్యూటీ స‌మంత త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లు ఎక్క‌నున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు మాత్రం ఈ అమ్మ‌డు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. అయిన‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో మాత్రం పోస్టులు చేస్తూనే ఉంది. తాజాగా ఈ అమ్మ‌డు తాను ఎరుపు రంగు లంగా ఓణీలో ఉండ‌గా దిగిన ఓ ఫొటోను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

అచ్చ‌మైన తెలుగు అమ్మాయిలా ఉన్నావంటూ ఆమె అభిమానులు కితాబిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆమె రాంచ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తోన్న 'రంగ‌స్థ‌లం' సినిమా షూటింగ్‌లో పాల్గొంటోంది. ఆ సినిమాలో సమంత ఇలా క‌న‌ప‌డ‌నుంద‌ని అభిమానులు అనుకుంటున్నారు. ఇటీవ‌లే స‌మంత ఈ సినిమాలో తాను ఇప్ప‌టి వ‌ర‌కు క‌న‌ప‌డ‌ని పాత్ర‌లో క‌న‌ప‌డనున్న‌ట్లు చెప్పింది. లంగా ఓణీలో డాబాపై నించొని, ఆకాశంవైపు చూస్తూ ఉన్న సమంత ఫొటో అభిమానులను అలరిస్తోంది.

  • Loading...

More Telugu News