: యోగా అంబాసిడ‌ర్‌గా నటించనున్న ప్రియాంక చోప్రా!


`క్వాంటికో` టీవీ సిరీస్ ద్వారా హాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన ప్రియాంక చోప్రా, బే వాచ్‌, ఎ కిడ్ లైక్ జేక్ సినిమాల త‌ర్వాత మూడో సినిమాకు ఓకే చెప్పింది. `ఈజింట్ ఇట్ రొమాంటిక్?` అనే టైటిల్‌తో వ‌స్తున్న ఈ సినిమాలో ప్రియాంక యోగా అంబాసిడ‌ర్‌గా క‌నిపించ‌నుంది. రెబెల్ విల్స‌న్‌, లియాం హెమ్స్‌వ‌ర్త్ లాంటి పెద్ద హాలీవుడ్ తార‌ల‌తో కలసి ఇందులో ప్రియాంక న‌టించ‌నుంది. ఇప్ప‌టికే ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌ధాన ఫొటోగ్ర‌ఫీ ప‌నులు మొద‌లైన‌ట్లు చిత్ర ద‌ర్శ‌కుడు టాడ్ స్ట్రాస్ తెలిపారు. 2019, ఫిబ్ర‌వ‌రి 14న వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని విడుద‌ల‌ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా ప్రియాంక రెండో హాలీవుడ్ సినిమా `ఎ కిడ్ లైక్ జేక్‌` 2018లో రిలీజ్ కానుంది. అంతేకాకుండా త‌న హాలీవుడ్ టీవీ సిరీస్ `క్వాంటికో`ను కూడా మూడో సీజ‌న్‌కు పొడిగించిన సంగ‌తి తెలిసిందే.

  • Loading...

More Telugu News