: గుంటూరు, విశాఖలలో భారీ వర్షం.. రహదారులు జలమయం!
ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. విశాఖపట్నం, గుంటూరుతో పాటు పలు ప్రాంతాల్లో పడుతోన్న వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. గుంటూరులో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. సత్తెనపల్లి పరిసర ప్రాంతాల్లో ఓ మోసర్తు వర్షం కురిసింది. విశాఖపట్నంలో కురుస్తోన్న వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. అక్కయ్య పాలెం, మద్దిల పాలెం, శాంతినగర్, ఇసుకతోట ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ చినుకులు పడుతున్నాయి.