: ప్రతిపక్ష నేత బాధ్యతలను కూడా నిర్వహించలేని జగన్.. 30 ఏళ్లు సీఎంగా ఉంటాడట!: కడప టీడీపీ అధ్యక్షుడి ఎద్దేవా
వైసీపీ అధినేత జగన్ పై కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా కూడా సమర్థవంతమైన పాత్రను పోషించలేకపోతున్న జగన్... 30 ఏళ్లు సీఎంగా ఉండాలని కలలుకంటున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్లీనరీ దోపిడీదారుల సమావేశం మాదిరి ఉందని అన్నారు. తిరుపతిలో జరుగుతున్న టీడీపీ రాయలసీమ కార్యకర్తల శిక్షణ శిబిరానికి నేడు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో గెలిస్తే వచ్చే రెండు దశాబ్దాలపాటు టీడీపీనే అధికారంలో ఉంటుందని చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని... వీటన్నింటినీ ప్రజల్లోకి కార్యకర్తలే తీసుకెళ్లాలని చెప్పారు. రాయలసీమలో కరవును పారద్రోలేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్ధితో పని చేస్తున్నారని తెలిపారు.