: డిస్ట్రిబ్యూటర్లకు క్యాష్ బ్యాక్ చేస్తున్న సల్మాన్ ఖాన్!


బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం 'ట్యూబ్ లైట్' ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకుంది. ఇటీవల కాలంలో సల్మాన్ నటించిన చిత్రాలన్నీ వందల కోట్లను రాబడుతున్నాయి. అయితే, ట్యూబ్ లైట్ మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పటి వరకు కేవలం రూ. 114 కోట్లను మాత్రమే కలెక్ట్ చేసింది. ఈ కలెక్షన్లతో సల్మాన్ కు వచ్చే నష్టం ఏమీ లేనప్పటికీ... డిస్ట్రిబ్యూటర్లు మాత్రం నష్టపోయారు. దీంతో, తమకు నష్ట పరిహారం కావాలంటూ వారు సల్మాన్ ను అడిగారట. దీనికి సల్మాన్ ఖాన్ ఒప్పుకున్నాడని... రూ. 55 కోట్ల పరిహారం ఇవ్వబోతున్నాడని ట్రేడ్ అనలిస్ట్ కోమల్ నా తా తెలిపాడు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ 'టైగర్ జిందా హై' సినిమా నిర్మాణంలో బిజీగా ఉన్నాడు.

  • Loading...

More Telugu News