: ఇది పిరికిపందలు చేసే పని: హీరోయిన్ కాజల్ అగర్వాల్
అమర్ నాథ్ యాత్రికులపై దాడి చేసి, ఏడుగురి ప్రాణాలను బలిగొన్న ముష్కరమూకలపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సినిమా సెలబ్రిటీలు సైతం ఈ దుశ్చర్యపై మండిపడుతున్నారు. హీరోయిన్ కాజల్ ఈ ఘటనపై స్పందిస్తూ, "ఇది పిరికిపందల చర్య. ఎంతో బాధను, కోపాన్ని కలిగిస్తోంది. ఉగ్రదాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా" అంటూ ట్వీట్ చేసింది.
యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఈ ఘటనపై స్పందించాడు. చనిపోయినవారిని, బాధితులను చూస్తుంటే ఎంతో బాధ కలుగుతోందని అన్నాడు. ఉగ్రవాదులు మరో నీచానికి ఒడిగట్టారని అన్నాడు.
రితీష్ దేశ్ ముఖ్ స్పందిస్తూ, దమ్ముంటే ప్రత్యక్ష యుద్ధానికి రావాలని... ఎవరు గెలుస్తారో చూద్దాం అంటూ ట్వీట్ చేశాడు. అమాయకుల ప్రాణాలను తీయడం సిగ్గుమాలిన చర్య అని అన్నాడు.