: విమానం డోర్‌ తీసిన ప్రయాణికుడు.. తృటిలో తప్పిన ప్రమాదం!


మ‌రి కాసేప‌ట్లో విమానం ల్యాండ్‌ అవుతుందనగా ఓ ప్రయాణికుడు ఎగ్జిట్‌ డోర్ తీసిన ఘ‌ట‌న ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలోని బ్రిసా ముందా విమానాశ్ర‌యంలో చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగక‌పోవ‌డంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై సంబంధిత అధికారులు మాట్లాడుతూ... విమానాశ్ర‌యంలో ఎయిర్‌ఏసియా విమానం రన్‌వేపైకి వస్తుండగా ఓ ప్రయాణికుడు ఒక్క‌సారిగా లేచి, డోర్‌ తెరిచాడు. దీనిని గ‌మ‌నించిన‌ పైలట్‌ చాకచక్యంగా విమానాన్ని కిందకు దించాడ‌ని, దీంతో తృటిలో ప్రమాదం తప్పిందని చెప్పారు. స‌ద‌రు ప్ర‌యాణికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.                

  • Loading...

More Telugu News