: కొత్త కోచ్ పేరును వెంటనే ప్రకటించండి: బీసీసీఐ ఆగ్రహం
టీమిండియా హెడ్ కోచ్ పదవికి ఇంటర్వ్యూలు ముగిశాయి. అయినా, ఇంతవరకు కోచ్ గా ఎవరిని ఎంపిక చేశారన్న విషయాన్ని సచిన్, గంగూలీ, లక్ష్మణ్ లతో కూడిన కమిటీ ఇంకా ప్రకటించలేదు. కెప్టెన్ విరాట్ కోహ్లీతో చర్చించిన తర్వాత కొత్త కోచ్ ఎవరనే విషయాన్ని వెల్లడిస్తామని గంగూలీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, కోచ్ పేరు వెల్లడించడాన్ని వాయిదా వేయడంపై బీసీసీఐ పరిపాలక కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్ అసహనం వ్యక్తం చేశారు. ఇంటర్వ్యూలు పూర్తయిపోయిన తర్వాత, కోచ్ పేరును వెల్లడించడాన్ని వాయిదా వేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ సాయంత్రంలోగా పేరును ప్రకటించాల్సిందేనంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.