: 2019 వరల్డ్ కప్ ను ఎలా కొట్టుకొస్తానన్న విషయాన్ని సెహ్వాగ్ చెబుతుంటే అబ్బురపోయి విన్న దిగ్గజ త్రయం!
భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి జరిగిన ఇంటర్వ్యూలలో టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 2019 వరల్డ్ కప్ ను ఏ విధంగా గెలవచ్చన్న విషయమై సెహ్వాగ్ ఇచ్చిన ప్రజెంటేషన్ ను సచిన్, సౌరవ్, లక్ష్మణ్ లు ఎంతో ఆసక్తిగా విన్నట్టు తెలుస్తోంది. అతను ఇచ్చిన సవివరమైన.. వ్యూహాత్మకమైన ప్రెజంటేషన్ కు కమిటీ సభ్యులు ముగ్గురూ అబ్బురపడ్డారట.