: నేను అమాయకుడిని.. ఈ కేసులో నన్ను ఇరికించారు: నటి భావనపై అత్యాచారం కేసులో హీరో దిలీప్
దక్షిణాది హీరోయిన్ భావనపై అత్యాచారం కేసులో పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన నటుడు దిలీప్, తనను అలువా సబ్ జైలుకు తరలిస్తున్న సమయంలో మీడియాతో మాట్లాడాడు. "నేను అమాయకుడిని. నా నిజాయతీని నిరూపించుకుంటాను. నన్ను ఈ కేసులో ఇరికించారు" అన్నాడు. నిన్న సాయంత్రం దిలీప్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, రహస్యప్రాంతంలో విచారించిన తరువాత అరెస్ట్ చేసినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
దిలీప్ అరెస్టుపై కేరళ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ లోక్ నాథ్ బెహెరా మాట్లాడుతూ, నటిపై కుట్ర వెనుక దిలీప్ హస్తముందని తమ వద్ద ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని అన్నారు. కాగా, గత వారంలో ఈ కేసులో ప్రధాన నిందితుడైన పల్సర్ సునీని రిమాండ్ కు తరలిస్తుంటే "ఓ పెద్ద షార్క్ దొరకబోతోంది" అని వ్యాఖ్యానించాడు. ఆ తరువాతే దిలీప్ పై విచారణ జరిగింది. దిలీప్ అరెస్ట్ ఇప్పుడు మాలీవుడ్ ను కుదిపేస్తోంది.