: 'ట్రావెల్ బ్యాన్' వెంటనే పరిష్కరించుకోండి!: దివాకర్ రెడ్డికి చంద్రబాబు సూచన!


విమానాలు ఎక్కకుండా విధించిన ట్రావెల్ బ్యాన్ వివాదాన్ని వెంటనే పరిష్కరించుకోవాలని అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. విశాఖ ఎయిర్ పోర్టులో బోర్డింగ్ పాస్ విషయంలో ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందిపై ఇటీవల దివాకర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా సిబ్బందిని తోయడమే కాకుండా, ప్రింటర్ ను కూడా కింద పడేసే ప్రయత్నం చేశారు జేసీ. దీంతో, ఆయనపై ఎయిర్ లైన్స్ సంస్థలు ట్రావెల్ బ్యాన్ విధించాయి. ఈ నేపథ్యంలో దివాకర్ రెడ్డితో చంద్రబాబు మాట్లాడుతూ, విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజుతో మాట్లాడి ఈ వివాదాన్ని వెంటనే పరిష్కరించుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News