: కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాసంలో హైలెవల్ సెక్యూరిటీ మీటింగ్
కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాసంలో హైలెవల్ సెక్యూరిటీ మీటింగ్ ప్రారంభమైంది. రక్షణ రంగానికి చెందిన పలువురు ఉన్నతాధికారులతో రాజ్ నాథ్ సింగ్ సమావేశమయ్యారు. అమర్ నాథ్ యాత్రికులపై టెర్రరిస్టులు దాడులు చేయడంపై రాజ్ నాథ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని సీరియస్ గా తీసుకున్న కేంద్ర మంత్రి, వెంటనే హైలెవల్ సెక్యూరిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఉధంపూర్, అనంత్ నాగ్ లలో పరిస్థితిని సమీక్షించి చేపట్టనున్న చర్యల వివరాలు తెలుసుకోనున్నారు. ఇప్పటికే జమ్మూకశ్మీర్ లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. అనంతనాగ్ జిల్లాను సైనికులు టెర్రరిస్టుల కోసం జల్లెడపడుతున్నారు. కాగా, అమర్ నాథ్ యాత్రికులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.