: ఈ రోజుల్లో ‘ల’కారం అంటే ‘ఆఫ్ట్రాల్’ అయిపోయింది: కోట శ్రీనివాసరావు


సినీ ఇండస్ట్రీలో నటుడిగా లక్ష రూపాయల రెమ్యూనరేషన్ అందుకోవడానికి తనకు పద్దెనిమిదేళ్లు పట్టిందని సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఆ లక్ష రూపాయల్లోనే మేకప్ మెన్ ని పెట్టుకోవాలి, కుర్రాళ్లకు ఇచ్చుకోవాలని చెప్పేవారని అన్నారు. లక్ష రూపాయలు రెమ్యూనరేషన్ గా ఇవ్వమని అడిగితే నిర్మాతలు ‘అమ్మో!’ అనే వారని, అయితే, తన నటన చూసి, మంచి నటుడని భావించి, వాళ్లే దయతలచి అంత మొత్తం ఇచ్చేవారని చెప్పుకొచ్చారు.

అయితే, ఇప్పటి పరిస్థితులు మారిపోయాయని, రోజు లెక్కన తీసుకుంటున్నారని.. ‘ల’కారం అంటే ‘ఆఫ్ట్రాల్’ అయిపోయిందని అన్నారు. 'సినిమా అంటే నమ్మించడం, నవ్వకుండా నవ్వించడం, కొట్టకుండా కొట్టామనిపించడం, ఏడ్వకుండా ఏడిపించడం.. అదీ సినిమా' అని కోట శ్రీనివాసరావు తన దైన శైలిలో చెప్పారు.

  • Loading...

More Telugu News