: ఉద్యోగుల తొలగింపు వ్యవహారంపై టెక్‌ మహీంద్రాకు హైకోర్టు నోటీసులు


ఉద్యోగుల తొలగింపు విషయమై ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ టెక్ మహీంద్రాకు ఉమ్మడి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ కంపెనీతో పాటు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ ముఖ్య కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కార్మిక శాఖ జాయింట్‌ కమిషనర్ కూ నోటీసులిచ్చింది. ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.

కాగా, టెక్‌ మహీంద్రలో ఉద్యోగుల తొలగింపును సవాలు చేస్తూ సుద్దాల సుధాకర్‌ మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఈ రోజు విచారణ జరిపారు. టెక్‌ మహేంద్ర కంపెనీ పలువురు ఉద్యోగుల్ని రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తోందని, సెలవుపై వెళ్లాలని కూడా వేధిస్తోందంటూ పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది ఎ.సత్యప్రసాద్ తన వాదనలు వినిపించారు.

  • Loading...

More Telugu News