: ప్రశాంత్ కిషోర్ మాయలు, మంత్రాలు చేసి వైసీపీని గెలిపిస్తారా?: టీడీపీ నేత సీఎం రమేష్


వైసీపీకి దమ్ములేనప్పుడు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాత్రం ఏం చేస్తారు? మాయలు, మంత్రాలు చేసి వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని గెలిపిస్తారా? అని టీడీపీ నేత సీఎం రమేష్ ప్రశ్నించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిన్న జరిగిన వైసీపీ ప్లీనరీలో జగన్ చెప్పినవన్నీ అవాస్తవాలేనని, జగన్ తన సామర్థ్యంపై నమ్మకం లేకనే, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను నియమించుకున్నారని విమర్శించారు.

ప్రశాంత్ కిషోరే తనను గెలిపిస్తాడని జగన్ చెబుతున్నారని, దీనిని బట్టి జగన్ స్థాయి ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి 35 సీట్ల కంటే ఎక్కువ రావని నాడు ప్రశాంత్ కిషోరే ఓ నివేదిక ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఈడీ కొత్తగా ఏ ఆస్తులు అటాచ్ చేస్తుందోనని జగన్ భయపడుతున్నారని, అందుకే, తన ఇష్టానుసారం ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏపీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమపడుతున్న చంద్రబాబుపై బురద జల్లాలనుకుంటే, జగన్ తనకు ఉన్న ఉనికిని కూడా కోల్పోతారని అన్నారు. 

  • Loading...

More Telugu News