: పోలీసుల బైక్ కొట్టేసి.. తలపై టోపీ పెట్టుకుని.. దూసుకుపోయాడు!
పోలీసుల బైక్ కొట్టేసిన ఓ తాగుబోతు తలపై టోపీ కూడా పెట్టుకుని రోడ్డుపై దూసుకెళ్లాడు. దీంతో షాక్‌కు గురైన పోలీసులు అతడిని వెంబడించి తిరిగి తమ బైకును, టోపీని లాక్కున్నారు. కర్ణాటకలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన జరుగుతుండగా తీసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ తాగుబోతుని పోలీసులు సుమారు ఒక కిలోమీటర్ వరకు వెంబడించినట్లు తెలుస్తోంది. తాగుబోతు బైక్‌పై వెళుతుండగా చూసిన ఇతర వాహనదారులు అతడిని 'సూపర్‌స్టార్ రజనీకాంత్' అంటూ మరింత రెచ్చగొట్టారు. ఈ వీడియో చూసినవారు నవ్వు ఆపుకోలేకపోతున్నారు.