: అమెరికా, జపాన్, భారత్ సంయుక్తంగా నౌకాదళ విన్యాసాలు ప్రారంభం!
బంగాళాఖాతంలో అమెరికా, జపాన్‌లతో కలసి భారత నౌకాదళం విన్యాసాలు నిర్వహిస్తోంది. ఇండో-ఆసియా-పసిఫిక్ తీరాల్లో సముద్ర భద్రత పట్ల బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ఈ విన్యాసాలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ప్రతిసారి అమెరికా, భారత్ దేశాలు మలబార్ సంయుక్త విన్యాసాలు నిర్వహించేవి. ఈ సారి జపాన్‌కి కూడా శాశ్వత సభ్యత్వం లభించడంతో ఈ విన్యాసాల్లో ఆ దేశం కూడా పాల్గొంటోంది.
ఈ విన్యాసాల్లో అమెరికాకు చెందిన యూఎస్ఎస్ నిమిట్జ్, యూఎస్ఎస్ ప్రిన్స్‌టన్, యూఎస్ఎస్ హోవర్డ్, యూఎస్ఎస్ షౌప్, యూఎస్ఎస్ కిడ్, పోసిడాన్ సబ్‌మెరైన్‌లు నౌకా విన్యాసాలు చేస్తున్నాయి. జపాన్ నుంచి 27 వేల టన్నుల జూమో యుద్ధ నౌకతో పాటు డెస్ట్రాయర్ జేఎస్ సాజనామీ ఉన్నాయి. ఇక భారత్‌కు చెందిన జెల్సావా, 45 వేల టన్నుల బరువున్న ఐఎన్ఎస్ విక్రమాదిత్యలతో పాటు పలు యుద్ధనౌకలు బంగాళాఖాతంలో జరుగుతున్న ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి.