: జక్కన్నను కలిసిన 'రోబో 2.0' నిర్మాత.... భారీ ప్రాజెక్టు కోసమే అని ఊహాగానాలు!
శంకర్ దర్శకత్వంలో రోబో 2.0 సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న లైకా ప్రొడక్షన్ స్థాపకుల్లో ఒకరైన రాజు మహాలింగం, టాలీవుడ్ జక్కన్న రాజమౌళిని కలిశారు. ఈ విషయాన్ని రాజు మహాలింగం ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. `రాజమౌళి గారిని కలిశాను.... బాహుబలి విజయం కంటే ఆయన వినమ్రత, అణకువ చాలా పెద్దవని కలిశాక అర్థమైంది` అని రాజు మహాలింగం ట్వీట్ చేశారు. దీంతో పాటు రాజమౌళితో దిగిన సెల్ఫీ కూడా ఆయన జత చేశారు. ఇదిలా ఉండగా రాజమౌళిని కలవడంలో ఉన్న ఆంతర్యం గురించి మాత్రం ఫిల్మ్‌నగర్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. త్వరలో వీరిద్దరి కాంబినేషన్‌లో ఏదైనా సినిమా రానుందా? ఒకవేళ అదే నిజమైతే మరో ప్రతిష్టాత్మక విజయం తథ్యమని అభిప్రాయపడుతున్నారు