: సుష్మా స్వరాజ్ లేఖని పట్టించుకోని పాక్ విదేశాంగ మంత్రి!
పాకిస్థాన్ మరణ శిక్ష విధించిన భారత నేవీ మాజీ ఆఫీసర్ కుల్‌భూషణ్ జాదవ్‌ను కలిసేందుకు వారి తల్లికి వీసా మంజూరు చేయాలని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ రాసిన లేఖను పాకిస్థాన్ విదేశాంగ మంత్రి సర్తాజ్ అజీజ్ కనీసం పట్టించుకోలేదు. ఆయన ఇలా ప్రవర్తించడంపై సుష్మ మండిపడ్డారు. విదేశాల్లో భారతీయుల సమస్యలు తీర్చడంలో ఎప్పుడూ ముందుండే ఆమె, ఒకవేళ సర్తాజ్ అజీజ్ కోరితే భారత్‌లో వైద్యం కోసం ఎదురుచూసే పాకిస్థానీయులకు వెంటనే వీసా మంజూరు చేస్తామని తెలిపారు. కనీసం వాళ్ల ప్రజల పట్ల కూడా సర్తాజ్ ఎందుకు కరుణ చూపించట్లేదో తనకు అర్థం కావట్లేదని సుష్మా అన్నారు. అంతర్జాతీయ కోర్టులో కుల్‌భూషణ్ జాదవ్ కేసు పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.