: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో తీవ్ర గందరగోళం... నిలిచిన ట్రేడింగ్
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ లో పలు కంపెనీల ఈక్విటీలు లాభాల్లో నడుస్తున్న వేళ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో ఈక్విటీ ధరలు అప్ డేట్ కాకపోవడంతో తీవ్ర గందరగోళం ఏర్పడగా ట్రేడింగ్ నిలిచిపోయింది. ఈ ఉదయం ట్రేడింగ్ సర్వర్లలో టెక్నికల్ సమస్య ఏర్పడిందని ఎన్ఎస్ఈ తాత్కాలిక చీఫ్ రవిచంద్రన్ వెల్లడించారు. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. క్యాష్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగాల్లో తాత్కాలికంగా లావాదేవీలను నిలిపివేశామని అన్నారు. ఈ ఉదయం 10.45కు ట్రేడింగ్ ప్రారంభమవుతుందని ఎన్ఎస్ఈ అధికారులు వెల్లడించినా, 11.20 గంటల సమయానికి ట్రేడింగ్ ఇంకా మొదలు కాలేదు. సాంకేతిక సమస్యల కారణంగా మార్కెట్ రీ ఓపెన్ సమయాన్ని తదుపరి తెలియజేస్తామన్న మెసేజ్ కనిపిస్తోంది.