: సెట్స్ లో స్పృహ తప్పి పడిపోయిన కపిల్ శర్మ!


హిందీ బుల్లితెర స్టార్ కమెడియన్‌ కపిల్‌ శర్మ స్పృహతప్పి పడిపోవడం బాలీవుడ్ లో కలకలం రేపింది. కామెడీతో స్టార్ హోదా సంపాదించుకున్న కపిల్ ఒక ఛానెల్ లో ‘ది కపిల్‌ శర్మ షో’కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో బాలీవుడ్ సినిమాల ప్రమోషన్ ను నిర్వహించే కపిల్‌ గత కొద్ది కాలంగా బీపీ, షుగర్ తో బాధపడుతున్నాడు. షారూఖ్ ఖాన్, అనుష్క శర్మ తాజాగా నటించిన ‘జబ్‌ హ్యారీ మెట్‌ సెజల్‌’ సినిమా ప్రమోషన్ కోసం నిర్వహించాల్సిన ఎపిసోడ్ చిత్రీకరణ ప్రారంభం కావాల్సి ఉండగా కపిల్ శర్మ సెట్స్ లో స్పృహతప్పి పడిపోయాడు. దీంతో ఈ ఎపిసోడ్ చిత్రీకరణ నిలిచిపోయింది. దీంతో అతనిని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న షారుక్‌, అనుష్క తిరిగి వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News