: గురువు గొప్పతనాన్ని మాటల్లో చెప్పలేం: సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్
గురువులందరికీ గురుపౌర్ణమి శుభాకాంక్షలు చెబుతున్నానని ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ అన్నారు. తాను గురువుగా భావించే ప్రముఖ కంపోజర్ దివంగత మాండోలిన్ శ్రీనివాస్ కు గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ రూపొందించిన ఓ స్పెషల్ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో దేవిశ్రీ పోస్ట్ చేశారు. ‘గురవే నమ:..’ అంటూ సాగే ఈ వీడియోలో మాండోలిన్ శ్రీనివాస్ చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఉన్న ఫొటోలను ఇందులో చూపించారు. ‘గురుపౌర్ణమి సందర్భంగా గొప్ప గురువులందరికీ ‘ప్రణామమ్. దీనిని నా గురువు మాండోలిన్ శ్రీనివాస్ అన్నకు అంకితం చేస్తున్నాను’ అని ఆయన పేర్కొన్నారు.