: అవినీతిలో బాహుబలి జగన్: సోమిరెడ్డి


అబద్ధాల్లో, అవినీతిలో జగన్ బాహుబలి అని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ ప్లీనరీ జరుగుతున్న తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. నేరచరిత కలిగిన జగన్, సీఎం పీఠంపై పిచ్చితో అబద్ధాలు మాట్లాడుతున్నారని, చంద్రబాబును తిట్టడానికి ఒక పార్టీ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రెండు రోజులు ప్లీనరీ పెట్టాలా? అని ప్రశ్నించారు.

అబద్ధాల్లో జగన్ కు డాక్టరేట్ ఇవ్వాల్సిందేనని, జగన్ కు పిచ్చి నెత్తికెక్కి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను వైసీపీకి సలహాదారుడిగా కాదు, ఆ పార్టీ కి అధ్యక్షుడిగా పెట్టుకోవాలంటూ సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. ప్రశాంత్ కిషోర్ ను సలహాదారుగా పెట్టుకున్నప్పుడే వైసీపీ పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ పాలన నుంచి వైజాగ్ భూముల విషయంలో ఏం జరిగిందో సిట్ తేల్చనుందని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని చర్యలు తప్పవని సోమిరెడ్డి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News