: చంద్రబాబు పప్పులిక ఉడకవు... ఇంట్లో ఉన్న ఆ ఒక్క 'పప్పు' తప్ప: కార్యకర్తలతో కేరింతలు కొట్టించిన షర్మిల


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లీనరీ వేదికపై ఉత్సాహంగా ప్రసంగించిన, జగన్ సోదరి షర్మిల కార్యకర్తలతో కేరింతలు కొట్టించారు. జగనన్న వదిలిన బాణాన్నే, అంటూ ప్రసంగం ప్రారంభించిన ఆమె, చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఆయన తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని ఆరోపిస్తూ, "చంద్రబాబు అవినీతి ఖ్యాతి ఒక్క రాష్ట్రంలోనే కాదు. దేశమంతా పాకింది. ఆయన దుర్మార్గం మోదీకి కూడా అర్థమైపోయింది. ఇక చంద్రబాబుగారి పప్పులు ఉడకవు. ఆయన ఇంట్లో ఉన్న ఆ ఒక్క పప్పూ తప్ప" అంటూ పరోక్షంగా లోకేశ్ మీద సెటైర్ వేశారు.

 షర్మిల ప్రసంగానికి వైకాపా కార్యకర్తల నుంచి అనూహ్య స్పందన రాగా, జగన్, విజయమ్మలు సైతం షర్మిల ప్రసంగాన్ని వింటూ నవ్వుతూ కూర్చున్నారు. ఇక, షర్మిల ప్రసంగిస్తుంటే ఆమె వెనుకే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు నిలబడి ఆమెను ప్రోత్సహించారు.

  • Loading...

More Telugu News