: హీరో నాగార్జున వైకాపాలో చేరనున్నారని వచ్చిన వార్తలపై అమల స్పందన ఇది!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తన భర్త, హీరో నాగార్జున చేరనున్నారంటూ వచ్చిన వార్తలపై అమల స్పందించారు. నాగార్జునకు ఏ పార్టీలోనూ చేరాలన్న ఉద్దేశం లేదని, అసలు ఆయన రాజకీయాల్లోకే రారని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే రూమర్లను నమ్మవద్దని చెప్పిన అమల, ఒకవేళ ఆ వార్తే నిజమైతే, తామే స్వయంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి, విషయాన్ని వెల్లడిస్తామని, రహస్యంగా దాచాల్సిన అవసరం తమకు లేదని పేర్కొంది. కాగా, నాగార్జున వైఎస్ఆర్ సీపీలో చేరుతారని, 2019 ఎన్నికల్లో పోటీ కూడా చేయబోతున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అమల ప్రకటనతో ఆ ఊహాగానాలకు తెరపడినట్లయింది.