: టీడీపీలోకి వెళ్లలేకుంటే జనసేనను ఆశ్రయిస్తారా?: రోజా ముందు ఓ ప్రశ్న


తెలుగు న్యూస్ చానల్ 'టీవీ-9'లో నిర్వహించే 'ఎన్ కౌంటర్ విత్ మురళీకృష్ణ'లో భాగంగా నేడు వైకాపా మహిళా నేత, ఎమ్మెల్యే రోజా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. "ఒకవేళ తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడితే, జనసేన పార్టీవైపు పోతారన్న ప్రచారం ఉంది. అవునా?" అన్న ప్రశ్నకు ఆమె సమాధానాన్ని ఇవ్వనున్నారు. ప్రజా ప్రతినిధిగా ఉన్న రోజా, బూతు డైలాగులు, ద్వంద్వార్థాలు వచ్చే జబర్దస్త్ వంటి కార్యక్రమాల్లో పాల్గొనడంపైనా, కేసుల విషయంలో భయపడే బీజేపీకి వైకాపా మద్దతు ఇస్తున్నదా? అన్న అంశాలపైనా ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం నేటి రాత్రి 9:30 గంటలకు ప్రసారం కానుంది.

  • Loading...

More Telugu News