: అధికారిపై చేప విసిరిన ఎమ్మెల్యే.. కేసు నమోదు చేసిన పోలీసులు
మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే నితేశ్ రాణే చిక్కుల్లో పడ్డారు. ఆయన ముంబయిలో ఇటీవల మత్స్యశాఖ అదనపు కమిషనర్‌పై చేప విసిరేసి, అసహనం ప్రదర్శించిన సంగతి విదితమే. మత్స్యకారుల సమస్యలపై చర్చించేందుకు ఆయన అధికారులతో భేటీ అయిన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆయనపై ఈ రోజు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ఎమ్మెల్యేపై మత్స్యశాఖ అధికారి చేసిన ఫిర్యాదు మేరకు తాము ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు అన్నారు.
తనపై నమోదైన కేసుపై స్పందించిన ఎమ్మెల్యే రాణే మత్స్యకారుల సమస్యలపై ఆ అధికారి సరిగా స్పందించకపోవడంతోనే తాను ఆయనపై చేపను విసిరానని అన్నారు. ప్రభుత్వ నిబంధనలను అధికారులు పాటించడం లేదని అన్నారు. మత్స్యకారులకు న్యాయం జరగాలనే తాను అలా ప్రవర్తించానని అన్నారు.