: ఉంగరం చోరీ చేసి... ప్రియురాలికి ఇచ్చి ప్రపోజ్ చేశాడు.. అరెస్టయ్యాడు!
ఓ ఉంగరాన్ని దొంగతనం చేసుకువచ్చి, తన ప్రియురాలికి ఇచ్చి ఐ లవ్ యూ చెప్పాడు ఓ యువకుడు. అయితే, తనకు ఇచ్చిన ఉంగరం చోరీ చేసి తీసుకువచ్చిందని గుర్తించిన ఆ యువతి అతడిని పోలీసులకి పట్టించింది. లండన్‌లోని వెస్ట్ మిడ్‌ల్యాండ్స్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే, స్టీవ్ రీడ్ అనే ఓ యువకుడు తన స్నేహితుడితో కలిసి దొంగతనం చేయడానికి బయలుదేరాడు. ఓ వృద్ధురాలు ఉన్న ఇంట్లోకి దూరి, ఆమెను కొట్టి నగలు, డబ్బు కాజేశాడు.
ఆమె వద్ద కాజేసిన నగల్లో ఓ ఉంగరాన్ని తీసుకుని తన ప్రియురాలి వద్దకు వెళ్లి ఆమెకు ఇచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయితే, ఆ దొంగతనం గురించి మీడియాలో వచ్చిన వార్తలు చూసిన ఆ యువతి, ఆ యువకుడు తనకు ఇచ్చిన ఉంగరం చోరీ చేసి తీసుకొచ్చిందేనని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో నిందితులని అరెస్టు చేసిన పోలీసులు... వారిని కోర్టులో ప్రవేశపెట్టగా రీడ్‌కు నాలుగేళ్ల 9 నెలల జైలుశిక్ష విధిస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది.