: `మహానటి` సినిమాకి హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్
అలనాటి మేటి నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న `మహానటి` సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా హాలీవుడ్‌లో పనిచేసిన డానీ సాంచెజ్ లోపెజ్‌ను తీసుకున్నారు. నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీపడకుండా ఆ మహానటి జీవితాన్ని తెరకెక్కించడానికి నిర్మాత స్వప్న దత్ కృషి చేస్తున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్‌లో `టర్న్ అరౌండ్`, బాలీవుడ్‌లో `దిల్ ధడ్కనే దో`, `డిటెక్టివ్ భ్యూమకేశ్ భక్షి` సినిమాలకు పనిచేసిన డానీ సాంచెజ్‌ను సినిమాటోగ్రాఫర్‌గా తీసుకురావడం సాహసమనే చెప్పాలి. కీర్తి సురేశ్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో సావిత్రి భర్త జెమినీ గణేశన్‌గా మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడు. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.