: ​రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం వార్తలపై హీరోయిన్ శ్రుతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్య!


సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా? రారా? ఎన్నో ఏళ్లుగా ఆయ‌న అభిమానుల్లో మెదులుతున్న ప్ర‌శ్న ఇది. త్వ‌రలోనే ర‌జ‌నీ రాజ‌కీయాల్లోకి వ‌స్తారు.. అంటూ ఎన్నోసార్లు వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేశాయి. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు ర‌జ‌నీ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌లేదు. ఇటీవ‌ల ర‌జ‌నీకాంత్ త‌న అభిమానుల‌తో స‌మావేశమై రాజ‌కీయాల్లోకి వ‌స్తారో, రారో స్ప‌ష్ట‌తనివ్వ‌కుండానే మళ్లీ షూటింగుల్లో పాల్గొన‌డానికి వెళ్లిపోయారు. ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరుల్లో మరోసారి భేటీ అవుతానని ప్రకటించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌నపై న‌టుడు క‌మ‌లహాస‌న్ తీవ్ర విమ‌ర్శలు చేసిన విష‌యం తెలిసిందే. కాగా, తాజాగా క‌మ‌ల్ కూతురు శ్రుతి హాస‌న్ కూడా ర‌జ‌నీ రాజ‌కీయరంగ ప్ర‌వేశం చేస్తార‌న్న వార్త‌ల‌పై స్పందించింది.

త‌న తండ్రి ర‌జ‌నీపై చేసిన విమ‌ర్శ‌ల‌కు భిన్నంగా శ్రుతి చేసిన చిన్న వ్యాఖ్య దేశ వ్యాప్తంగా వార్త‌ల్లో నిలిచింది. ర‌జ‌నీ రాజకీయాల్లోకి వస్తే తాను ఆయ‌న‌కు మద్దతిస్తానని అంటూ ఈ ముద్దుగుమ్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేసింది. ఆయ‌న‌ రాజకీయాల్లోకి రావడాన్ని తాను స్వాగ‌తిస్తాన‌ని వ్యాఖ్యానించింది. శ్రుతి చేసిన ఈ వ్యాఖ్య ఎంతో ఆస‌క్తిని రేపుతోంది.  

  • Loading...

More Telugu News