: అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలో కూడా ఈ ప్లీనరీలో చర్చిద్దాం: జగన్


వైసీపీ ప్లీనరీని ఆ పార్టీ అధినేత జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు. తన తండ్రికి నివాళి అర్పించి, ప్రారంభోపన్యాసం చేశారు. దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి చేయలేని, చేయడానికి సాహసించలేని ఎన్నో కార్యక్రమాలను రాజశేఖరరెడ్డి చేపట్టారని అన్నారు. రైతులు, విద్యార్థులు, మహిళలు ఇలా ఎవరి నోట విన్నా రాజన్న రాజ్యం రావాలనే కోరికే వినబడుతోందని చెప్పారు. ఈ మూడేళ్ల చంద్రబాబు పాలనలో జనాలు ఎంతో బాధపడుతున్నారని... చంద్రబాబు పాలన ఎప్పుడు అంతమవుతుందా? అని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు.

రాబోయే రోజుల్లో ఏం చేయాలి, ఎలాంటి పోరాటాలు చేయాలి, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలనే దానిపై కూడా ఈ ప్లీనరీలో చర్చించుకుందామని తెలిపారు. రేపు తన సుదీర్ఘమైన ప్రసంగం ఉంటుందని చెప్పారు. ఇక్కడకు వచ్చిన వారంతా సలహాలు ఇవ్వచ్చని... వేదికపైన ఉన్న సీనీయర్లంతా సలహాలను వింటారని చెప్పారు. ఎన్నో విషయాలపై చర్చించి, తీర్మానాలు చేద్దామని తెలిపారు. ప్లీనరీకి వచ్చిన ప్రతి ఒక్కరికీ చేతులు జోడించి, శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా పెద్దలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును కోరుతున్నానని చెప్పారు. 

  • Loading...

More Telugu News