: నేనా! రాజకీయాల్లోకా?...అంతా అబద్ధం!: కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్
తాను రాజకీయాల్లోకి వస్తున్నానంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమైనదని, అవాస్తవమని కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తెలిపారు. కర్ణాటకలోని హసన్ నగరంలో కల్యాణ్ జ్యుయలర్స్ బ్రాంచ్ ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సినిమాల్లో నటిస్తూ ఆనందంగా ఉన్నానని చెప్పారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనేదీ లేదని ఆయన స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నానంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని ఆయన తెలిపారు. కళ్యాణ్ జ్యుయలర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నానని ఆయన చెప్పారు. తన తల్లి మృతి చెందిన నేపథ్యంలో తమను పరామర్శించేందుకే ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తమ నివాసానికి వచ్చారని, అంతే తప్ప తమ మధ్య ఎలాంటి రాజకీయ సంబంధ చర్చ రాలేదని ఆయన తెలిపారు.